calender_icon.png 28 December, 2024 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

01-12-2024 06:43:49 PM

చీఫ్ కన్జర్వేటర్ ఇలుసింగ్ మేరు

పులి దాడి నుండి తప్పించుకునేందుకు మాస్కులు అందజేత 

పులి దాడుల నేపథ్యంలో అవగాహన

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): పులి దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ కన్జర్వేటర్ ఇలుసింగ్ మేరు కోరారు. ఆదివారం జిల్లాలోని ఇటిక్యల్ పహాడ్ గ్రామంలో కన్జర్వేటర్ శాంతారామ్, డి ఎఫ్ ఓ నీరజ్ కుమార్ ఫ్లైన్స్ కార్డ్ వేణు బాబుతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ మాట్లాడుతూ.. జిల్లాలో పులులు సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలు తమ స్వీయ రక్షణ కోసం మాస్కులు ధరించాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలో తిరగవద్దని కోరారు. ప్రస్తుత కాలంలో పులులు ఆవాసం కోసం సంచారం చేస్తాయని ఈ క్రమంలోనే అటవీ ప్రాంత సమీపంలో తిరుగుతాయని తెలిపారు. మాస్కులను వెనుక భాగంలో ధరించి చేను పనులకు వెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా మాస్కులను పంపిణీ చేశారు. వారి వెంటా సిర్పూర్ డివిజన్ లోని ఫారెస్ట్ అధికారులున్నారు.