హుజురాబాద్, విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని ధర్మరాజు పల్లి స్టేజి వద్ద బుధవారం ట్రాలీ ఆటో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజువారిగనే వ్యవసాయ కూలీలను తీసుకొని పొలం వద్దకు వెళ్తుండగా ధర్మరాజు పల్లె స్టేజి వద్ద డివైడర్ ఢీకొని ఆటో ట్రాలీ E-mail పడడంతో12మందికూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సహాయంతో హుజురాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.