calender_icon.png 27 April, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి

26-04-2025 11:47:46 PM

శాఖల మధ్య సమన్వయంతోనే సాధ్యం..

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్..

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): ప్రజల భద్రతకు ప్రాధాన్యామివ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రమాదాల నివారణకు విద్యుత్, ఫైర్, ఇండస్ట్రీలు ఎవరికి వారు కాకుండా ఆయా వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేయాల్సినవసరం ఉందని సూచించారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్ బిల్డింగ్స్ అనే అంశంపై శనివారం హైడ్రా కార్యాలయంలో జరిగిన సదస్సులో ఏవీ రంగనాథ్ మాట్లాడారు. భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో పరిశీలించడానికి సంబంధిత విభాగాలకు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడల్ ఏజెన్సీని రూపొందించాలని అభిప్రాయపడ్డారు.

విద్యుత్ వైరింగ్, ఎర్తింగ్, నాణ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలను వినియోగిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలే కాకుండా అపార్టుమెంట్లు, కార్యాలయాలు, నివాసాల్లో కూడా భద్రతా ప్రమాణాలు పాటించేలా ఈ నోడల్ ఏజెన్సీ చూడాలన్నారు. కార్యక్రమంలో హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకుడు పాపయ్య, ఎస్పీ సుదర్శన్, డిప్యూటీ కలెక్టర్ సుధ, ఆర్‌ఎఫ్‌వో జయప్రకాశ్, డీఎఫ్‌వోలు యజ్ఞనారాయణ, గౌతం, వివిధ శాఖల అధికారులు రాజగోపాల్,  భీమారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీనివాస్, కృష్ణ రమేష్ పాల్గొన్నారు.