మండలి బీఆర్‌ఎస్ పక్షనేత మధుసూదనాచారి
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోందని, అప్పుడే ప్రజల్లో ఛీత్కారం వచ్చిందని బీఆర్‌ఎస్ శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.
తాను 42 ఏం డ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల ఛీత్కారం ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇదేనని చెప్పారు. వద్దు బాబు మాకు కాంగ్రెస్ పాలన అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ఆషామాషి నేత కాదని, ప్రజల సమస్యలు పరిష్కరించే కోణంలో ఆయన పాలించారని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన తెలంగాణను కేసీఆర్ అందిస్తే, కాంగ్రెస్ దా న్ని ఆగం చేస్తోందని విమర్శించారు. సీఎం పదవి స్థాయి ఇంత ఘోరంగా ఎప్పుడూ పడిపోలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చేసుకునేందుకు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.