బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరిస్తున్నారని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైందన్నారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌నకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పార న్నారు.
ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, స్వచ్ఛమైన పాలన అందిస్తున్న మోదీని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాబోవు రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు.