- వైట్‌హౌస్‌లో ప్రదానం చేసిన అమెరికాఅధ్యక్షుడు జో బైడన్
- వ్యాపారవేత్త జార్జ్ సోరిస్‌కు పురస్కారం ఇవ్వడంపై ఎలాన్ మస్క్ అభ్యంతరం
- మానవాళి ద్వేషికి అవార్డు ఇచ్చారని విమర్శలు
వాషింగ్టన్, జనవరి 5: అమెరికా రాజాధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో ఆదివా రం అధ్యక్షుడు జోబైడన్ 19 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారంతా రాజకీయం, వినోదం, పౌర హక్కులు, సైన్స్ వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన వారే.
ప్రకృతివైపరీత్యాల నివారణపై పరిశోధనలు చేసిన జోస్ అండ్రెస్, సామాజిక ఉద్యమకారుడు బోనో, ఆర్మీ నిపుణుడు అస్తోన్ బల్వడిన్ కార్టర్ (మరణానంతరం), మాజీ విదేశాంగశాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, న్యాయనిపుణుడు, నటుడు మైఖేల్ జే ఫాక్స్, పౌరహక్కుల ఉద్యమకారుడు టిమ్‌గిల్, పరిశోధకుడు, శాస్త్రవేత్త జేన్ గుడాల్, సామాజిక ఉద్యమకారిణి ఫన్నీ లౌ హామర్ (మరణానంతరం), క్రీడాకారుడు ఇర్విన్ ‘మ్యాజిక్’ జాన్సన్, సామాజికవేత్త రాబర్ట్ ఫ్రాన్సీస్ కెన్నెడీ (మరణానంతరం), ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, న్యాయవాది విలియం శాన్‌ఫోర్డ్, వ్యాపారవేత్త జార్జ్ డబ్ల్యూ రోమ్నీ (మరణానంతరం), వ్యాపారవేత్త డేవిడ్ ఎం రూబెన్ స్టెయిన్, వ్యాపారవేత్త జార్జ్ సోరోస్, రచయిత, దర్శకుడు జార్జ్ స్టీవెన్స్ జూనియర్, నటుడు, నిర్మాత డెంజెల్ వాషింగ్టన్, సంపాదకుడు అన్నా వింటార్ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.
జార్జ్ సోరోస్‌కు మనుషులంటే ద్వేషం: ఎలాన్ మస్క్
అమెరికన్ వివాదాస్పద వ్యాపారవేత్త జార్జ్ సోరస్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించగా, జార్జ్ వైట్‌హౌస్‌కు కుమారుడు వచ్చి దేశాధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
జార్జ్ సోరోస్‌కు పురస్కారం ప్రకటించడంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జ్ మనుషులంటేనే ద్వేషమని అని మండిపడ్డాడు. జార్జ్ మానవజాతిని అసహ్యించుకుంటాడని, అతడిని ‘డార్ట్ సిడియోసిస్’ అనే విలనీ క్యారెక్టర్‌తో పోలుస్తూ ‘మీమ్’ను సైతం జోడించాడు. అధికార డెమోక్రటిక్ పార్టీ పనిగట్టుకుని జార్జ్‌కు పురస్కారాన్ని ప్రదానం చేసిందని విమర్శనాస్త్రాలు సంధించాడు.