calender_icon.png 8 January, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60 మందికి పెగా హె బిజ్ టీవీ పురస్కారాలు

08-01-2025 12:27:17 AM

  1. ‘విజ్ఞాన్’ అధినేతకు రత్తయ్యకు ‘జీవన సాఫల్య’ అవార్డు
  2. ముఖ్యఅతిథులుగా శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి, ‘విజయక్రాంతిదినపత్రిక ఎండీ చిలప్పగారి విజయారాజం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి)/అబ్దుల్లాపూర్‌మెట్: విద్యారం గంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను ‘హై బిజ్ టీవీ’ సంస్థ ఈ ఏడాది 60 మందికి పైగా విద్యా పురస్కారాలు ప్రకటించింది. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సంస్థ ప్రతినిధు లు మంగళవారం ముఖ్యఅతిథులు శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి, విజయక్రాంతి, మెట్రోఇండియా పత్రికల ఎండీ చిలప్పగారి విజయారాజం చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు అవార్డులు ప్రదానం చేయించారు.

అలాగే విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సైఫల్య పురస్కారం ప్రదానం చేశారు. సంస్థ ప్రతి జిల్లా నుంచి ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి హెచ్‌ఎంలకూ పురస్కారాలు అందజేసింది.

కార్యక్రమానికి అతిథులుగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి, సెయింట్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మ న్, వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి , డాక్టర్ ప్రీతిరెడ్డి,- మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైైర్‌పర్సన్, భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, హై బిజ్ టీవీ, తెలుగు నౌ ఎండీ రాజగోపా ల్, హై బిజ్ టీవీ ఎల్‌ఎల్‌పీ ఎండీ డాక్టర్ జె. సంధ్యారాణి పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడు తూ.. విద్యారంగంలో చేస్తున్న కృషిని గుర్తించి హై బిజ్ టీవీ ఏటా అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.

మజీద్‌పూర్ సర్కార్ బడికి పురస్కారం..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మజీద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలకు అరుదైన  పురస్కారాన్ని దక్కించుకున్నది. పాఠశాల యాజమాన్యం ఇటీవల ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే నినాదంతో గ్రామస్తుల నుంచి నిధులు సేకరించి బడిని బాగు చేసింది. దీంతో పాఠశాల ‘హై బిజ్ టీవీ’ విద్యా పురస్కారానికి ఎంపికైంది. పాఠశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్‌రెడ్డి ఈ మేరకు మంగళవారం హైదరా బాద్‌లోని హెచ్‌సీసీలో సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.