- ప్రకటించిన కమిటీ చైర్మన్ పద్మనాభయ్య, దానకిశోర్
- జనవరి 26న గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ‘గవర్నర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లె న్స్-2024’ అవార్డులను సోమవారం రాజ్‌భవన్ ప్రకటించింది. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవార్డ్స్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ కే పద్మనాభయ్య, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ 8 మందితో కూడిన పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడించారు.
వ్యక్తిగత విభాగంలో నలుగురిని, ఇన్‌స్టిట్యూట్ విభాగంలో నాలుగు సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 594 దరఖాస్తులు వచ్చాయని, అందు లో గ్రామీణ ప్రాంతాల నుంచి 263, పట్టణ ప్రాంతాల నుంచి 331 దరఖాసులొచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం దా నకిశోర్ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈనెల 26న జరిగే ఎట్ రాజ్‌భవన్ కార్యక్రమంలో ఈ అవార్డులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించనున్నట్లు పేర్కొన్నారు. అవార్డు కింద రూ.2లక్షలు, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి ఈ అవార్డులతో ప్రోత్సహించాలనే ఉద్ధేశంతోనే అవార్డులను ప్రదానం చేయనున్నట్లు, మున్ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఏటా పురస్కరాలు ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అవార్డ్స్ కమిటీ సభ్యులు అనిల్ కుమా ర్, పీ హనుమంతరావు, డాక్టర్ పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవార్డులకు ఎంపికైనవారు
1. దుశ్చర్ల సత్యనారాయణ - పర్యావరణ పరిరక్షణ
౨. అరికపూడి రఘు - దివ్యాంగుల సంక్షేమం
౩. పారాఒలంపిక్ విజేత జివాంజి దీప్తి - స్పోర్ట్స్ అండ్ గేమ్స్
4. పీబీ క్రిష్ణభారతి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావుకు సంయుక్తంగా - కల్చర్
5. ధ్రువాంశ్ ఆర్గనైజేషన్ - పర్యావరణ పరిరక్షణ
6. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి - దివ్యాంగుల సంక్షేమం
7. ఆదిత్యా మెహతా ఫౌండేషన్ - స్పోర్ట్స్ అండ్ గేమ్స్
8. సంస్కృతి ఫౌండేషన్ - కల్చర్