26-03-2025 10:31:03 PM
బిజెపి మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు..
మునుగోడు/చండూరు (విజయక్రాంతి): బుటకపు మాటలతో గద్దెనెక్కి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందుకు గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలయిందని చండూర్ బిజెపి మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమలు చేయనందున బుధవారం మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలం చామలపల్లి గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల నుండి దరఖాస్తులు సేకరించారు.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వానికి అందజేసి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుపరిచే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు వరికుప్పల గిరి, గుండెల యాదగిరి, నీలకంఠం నగేష్, కాటం ఆంజనేయులు, గోళ్ళూరి శేఖర్, నాంపల్లి నరేష్, కాటం అశోక్, ముంత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.