* నిందితుడిని అరెస్ట్ చేసిన నాగ్‌పూర్ పోలీసులు
న్యూఢిల్లీ, జనవరి 15: కౌన్సిలింగ్ ముసుగులో బాలికలపై అత్యాచారం చేస్తున్న 47ఏళ్ల సైకాలజిస్టును మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ,ఎస్టీ చట్టాల కింద మూడు కేసులు నమోదు చేశారు.
నిందుతుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత వికాస శిబిరాలను నిర్వహించి 15ఏళ్లకు పైబడిన సుమారు 50 మందిపై అత్యాచారానికి పాల్పడుతూ కెమెరాల్లో రికార్డు చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత వీడియోల పేరుతో బాధితులున బ్లాక్‌మెయిల్ చేసిట్టు పేర్కొన్నారు. తాజాగా ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.