calender_icon.png 21 April, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ప్రతిభా పరీక్షలు పేద విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 06:23:12 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ప్రతిభా పరీక్షను జిల్లాలో 4, 5, 6 చదువుతున్న నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజా వేణులు కోరారు. హైదరాబాదులోని ప్రగతి నగర్ లో ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన అందిస్తున్న పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ విద్యా సంవత్సరంలో 5, 6, 7వ తరగతులలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఈ ఎంపిక ప్రక్రియను చేపడుతుందని చెప్పారు.

ఈ నెల 24న ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలో ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, గణితం సబ్జెక్టుల నుండి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం 4, 5, 6 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 18 లోపు దరఖాస్తులను http://forms.gle/uhxd4dj80yxmudfm7 గూగుల్ ఫామ్ లో చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి -9704634005, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజా వేణు-9491345407 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు.