03-03-2025 06:30:27 PM
రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు పూర్తి కాలేదు..
ఆర్ అండ్ బి అధికారులకు ఆరు గ్రామాల ప్రజల వినతి..
ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు పోయాయి అంటున్న గ్రామస్తులు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గంగమ్మ వాగు బ్రిడ్జి పనులు పూర్తి చేయండి సార్లు అంటూ 6 గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. సోమవారం రామారెడ్డి పోసానిపేట్ రంగంపేట మోసింపూర్ ఉప్పల్వాయి మద్దికుంట గోకుల్ తండా గ్రామాలకు చెందిన వారు ఆర్ అండ్ బి ఈ ఈ ను కలిసి విన్నవించేందుకు వచ్చారు. ఈఈ రవిశంకర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో ఉన్న డీఏవో సంతోషికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు. వచ్చేది వర్షాకాలం కావున తొందరగా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలని వారు కోరారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి బ్రిడ్జి వారధిగా ఉన్నందున 20 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జిపై నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తము రావడం జరుగుతుంది. రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున వర్షాకాలము మొదలుకాకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా చేపట్టి అందుబాటులోకి తేవాలని కోరడం జరిగినది. డిఎఓ సంతోషి మేడంకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు కాలభైరవ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ గంజి సతీష్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగేల శ్రీనివాస్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగం లింగం, రాజు పాల్గొన్నారు.