calender_icon.png 16 January, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషజ్వరాలతో మంచాన పడుతున్న సీతంపేట ప్రజలు

25-08-2024 12:04:26 PM

 పట్టించుకోని ప్రత్యేక అధికారులు

(ముత్తారం, విజయక్రాంతి): ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామంలో గత వారం రోజుల నుండి విష జ్వరాలు ప్రబలుతున్నాయని  గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురికి విష జ్వరాలు వస్తున్నాయని, గ్రామ పంచాయతీలలో 8 నెలల నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని, అప్పటి నుండి ఇప్పటి వరకు శానిటేషన్ విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ,స్పెషల్ ఆఫీసర్ ఊరికి 15 రోజులకు ఒకసారి వస్తున్నాడని, గ్రామ కార్యదర్శి వారానికి ఒక రోజు వస్తున్నాడని, దీంతో ఎక్కడి చెత్త చెదారం అక్కడనే ఉండిపోవడంతో దోమలు ప్రవళుతున్నాయని, దోమల వల్లనే విష జ్వరాలు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఏడు నెలల నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దోమల నివారణ మందు కొట్టలేదని, మురికి కాలువలు తీయడం లేదని, వీటి వలెనే దోమలు ప్రబలుతున్నాయని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 సంవత్సరంలలో ఊరు మొత్తం విష జ్వరాల బారిన పడి మంథని, గోదావరిఖని పెద్దపెల్లి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారని ,అయినప్పటికీ ఇది నూనెటి లింగయ్య, కొండ సారాయ అనే వ్యక్తి జ్వరాలతోనే మృతి చెందినారని,  గ్రామంలో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఊర్లో స్ట్రీట్ లైట్స్ లమ వెలగడం లేదని, అధికారులు  తక్షణమే స్పందించి మా ఊరి ప్రజలను విష జ్వరాల నుండి కాపాడగలరని  మాజీ సర్పంచ్ పులిపాక నగేష్ వైద్యాధికారులను కోరారు.

సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం: మండల వైద్యాధికారి  అమరేందర్ రావు

ఈ విషయంపై మండల వైద్యాధికారిని వివరణ కోరగా సీతంపేటలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తామన్నారు.