వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
పాత్రికేయల సమావేశంలో ముత్తారం ఎస్సై నరేష్
ముత్తారం, (విజయక్రాంతి): ముత్తారం మండల ప్రజలు ప్రజలు శాంతియుతంగా రాబోయే పండుగలు జరుపుకోవాలని శుక్రవారం ముత్తారం పోలీస్ స్టేషన్లలో పాత్రికేయల సమావేశంలో ఎస్సై గొపతి నరేష్ అన్నారు. మండల పరిధిలోని గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగ ల దృష్ట్యా పండుగా లను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లలో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్ లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని, గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుందని, ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయాల్ 100 కు లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని, సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి, మత ఘర్షణలు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ వీరస్వామి, కానిస్టేబుల్స్ సంతోష్, అశోక్, విజయ్ గౌడ్, చంద్రశేఖర్, రాజు సిబ్బంది పాల్గొన్నారు.