కొత్తపల్లి, జనవరి22 (విజయక్రాంతి): ఈ నెల 24 న కేంద్ర మంత్రుల సభను విజయవంతం చేసేందుకు విలీన గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని 18వ డివిజన్ రేకుర్తి బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధుల కింద పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పాల్గొంటున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎడమ సత్యనారాయణ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోదరి నరేష్ ముప్పుడ బూత్ అధ్యక్షులు నాంపల్లి శంకర్ దుర్గం ఆంజనేయులు దుర్గం మోహన్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.