calender_icon.png 1 April, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఆర్ఎస్ రాయితీని మంథని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

29-03-2025 07:16:42 PM

మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్..

మంథని (విజయక్రాంతి): ఎల్ఆర్ఎస్ 25% రాయితీని మంథని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము ప్రకటించిన ఎల్ఆర్ఎస్ రుసుము 25 శాతం తగ్గింపు రాయితీ, ఆస్తి పన్ను (ఇంటి పన్ను) బకాయిలు గల యజమానులకు వన్ టైం స్కీం 2024-25 సంవత్సరం వరకు బకాయి ఉన్న ఆస్తి పన్ను ఒకేసారి చెల్లించిన వారికి ఆస్తిపన్నుపై గల వడ్డీలో 90 శాతం రాయితీని కల్పించడం జరిగినదని, ఈ అవకాశం మార్చి 31, 2025 వరకు మాత్రమేనని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.