తాజా మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి
పెద్దపల్లి,(విజయక్రాంతి): కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాజా మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వాగులు, వంకలు, పారుతుంటే, దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప, బయటికి రావద్దని, ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు వెల్లడించారు. ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు ఉన్నారు.