23-02-2025 12:00:00 AM
చాలామందికి ఒంట్లో వేడి చేస్తుంది. వేడి చేస్తే పెదాలు నల్లబడిపోతాయి. ముఖం మాడిపోయినట్లు అవుతుంది. అలాగే కడుపులో మంట, కళ్లలో మంట.. ఇలా ఒంట్లో వేడి తన్నుకొచ్చేసి ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే?
ఒక టేబుల్ చెంచా మెంతులు నిత్యం తినే ఆహార పదార్థాల్లో వాడండి. అంటే కూరలు, పులుసులు చేసేటపుడు ఇవి వాడితే శరీరంలోని వేడిని లాగేస్తాయి.
ఉదయాన్నే గ్లాస్ నిమ్మరసం తాగితే కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. ఉప్పు, లేదా పంచదార వేసుకుని నిమ్మరసం నీళ్ళ తాగొచ్చు.
గసగసాలు వేడిని బాగా తగ్గిస్తాయి. కాని, మోతాదు మించి తీసుకోవద్దు.
మంచి నీళ్లు బాగా తాగితే శరీరంలో వేడి తగ్గిపోయి సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.
అలోవెరా జ్యూస్ కూడా చలవ చేస్తుంది. దాని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే ఒళ్లు చల్లబడుతుంది.
బార్లీ గింజలను వేయించుకొని, పొడి చేసుకొని మజ్జిగలో వేసుకొని తాగితే వేడి తగ్గుతుంది.