24-03-2025 03:42:32 PM
భద్రాచలం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కొలిపోయారని, గత ప్రభుత్వంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మూడు రంగుల జండా కలర్లు వేసి మా ప్రభుత్వంలో ఇచ్చాము మేము కట్టాం అని గొప్పలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాంప్రసాద్ మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో భద్రాచలం పట్టణ ప్రజలకు డంపింగ్ యార్డ్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించి కెసిఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని, దాన్ని కూడా ప్రారంభించి మేమే చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని 15 నెలల కాలంలో కాంగ్రెస్ భద్రాచలం పట్టణాభివృద్ధికి శాశ్వత పరిష్కారం ఏమి చూపిందని రావులపల్లి రాంప్రసాద్ విమర్శించారు. నియోజవర్గ ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయని దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో వంతెన కూలిపోయి ఇప్పటికి ఏడుగురు మరణించారని వెంకటాపురం మండలంలో ఇసుక లారీల లోడు తట్టుకోలేక మరో వంతెన కూలిపోయిందని కనీసం నూతనంగా వంతెనలు నిర్మాణానికి అధికార ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడం లేదని డైవర్షన్ రోడ్లు వేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కెసిఆర్ ప్రభుత్వంలో 38 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే పనులు మధ్యలోనే ఆగిపోయాయని కనీసం ఒక రూపాయి కూడా అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట మీద ఖర్చు చేయలేదని అన్నారు. కేవలం గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు గత ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని. అంతేగాని ఈ ప్రచార ఆర్భాటాలు తగ్గించి ప్రజలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మండల పార్టీ సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ కుమార్, దుమ్ముగూడెం మండల నాయకులు బోల్లి వెంకటరావు, కాలువ పూర్ణయ్య, కొత్త మల్లేష్, భక్తుల నరసింహులు, అంబటి కర్ర కృష్ణ, ఇమంది నాగేశ్వరరావు, మొరాల డానియల్ ప్రదీప్, ఖాదర్, కొలిపాక శివ,మోహన్ రావు తదితరులు ఉన్నారు