నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ దశ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ప్రధాన పూజారి రామన్ కన్నన్ ఆధ్వర్యంలో పూజలు సంకీర్తనలు నిర్వహించారు. భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.