calender_icon.png 24 April, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనం కామన్ మ్యాన్ కథల్నే ఇష్టపడుతున్నారు

24-04-2025 12:00:00 AM

ప్రియదర్శి కథానాయకుడిగా వస్తున్న తాజాచిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శి తాజాగా హైదరాబాద్‌లో మీడి యాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ‘సారంగపాణి జాతకం’ చిత్ర విశేషాలివీ.. “సారంగపాణి జాతకం’ కథ క్రితపు సంవత్సరం  విన్నాను.

గత ఏడాది చివరలోనే రావాల్సిన సినిమా ఇది. ‘కోర్ట్’ లాంటి హిట్ తర్వాత ఈ సినిమా వస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చూపించినట్టు కాదు గానీ.. నేను కొంతవరకు జాతకాలను నమ్ము తాను. ఇండస్ట్రీలో ఏదీ మన చేతుల్లో ఉండదు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ బిజినెస్‌పరంగా, థియేటర్ల పరంగా అన్నీ లెక్కలేసుకొని ఇప్పుడొస్తున్నాం. ఇండస్ట్రీలోకి రాకముందు జాతకాలు చూపిస్తే అస్సలు నేను యాక్టర్ అవ్వను అని చెప్పారు.

కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. మా అమ్మ తన కొడుకు ఏమైపోతాడో అని అలా జాతకం చూపించారు. కానీ నేను నామీద నమ్మకంతో వచ్చాను. చేసే పని మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నానంతే! అయితే, జాతకాలు నమ్మాలనో.. నమ్మకూడదనో మేం ఈ  సినిమాలో చెప్పడంలేదు. కానీ ఒకరి నమ్మకాన్ని మరొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తాం. ఏ ఒక్క సైడ్ తీసుకొని మాత్రమే కథను చెప్పలేదు.

కామన్ మ్యాన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. ‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’, ‘సారంగపాణి’ మన చుట్టూ ఉండే మనుషుల పాత్రలు. వాళ్ల జర్నీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో జాతకాల్ని నమ్మే ఓ కుర్రాడి పాత్రను పోషించాను. ప్రస్తుతం చాలా కష్టతరమైన పని. ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకూ ఎక్కువగా నేను తెలంగాణ యాసలోనే మాట్లాడాను.

ఈసారి ఆంధ్ర మాండలికంలో మాట్లాడతాను. ఇంద్రగంటి స్టుల్‌లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నాకోసం సఫరేట్ ట్రాక్‌ను, టైమింగ్‌ను సెట్ చేశారు. అది అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఇంద్రగంటి చాలా ఎక్కువగా కష్టపడ్డారు. సెట్స్ మీదకు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోయానంతే! ఎప్పుడూ ఒత్తిడికి గురైనట్టు భావించలేదు. ప్రస్తు తం జనాలు కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రోత్సహిస్తున్నారు.

కామన్ మ్యాన్ కథల్నే జనం ఇష్టపడుతున్నారు. ‘లక్కీభాస్కర్’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లో సామాన్యుడే హీరోగా మారాడు. అప్పట్లో చిరంజీవి కూడా అదే ఫార్మాట్‌లో చాలా సినిమాలు చేసి అందర్నీ మెప్పించారు. ఇక నా రాబోయే సినిమాలు గురించి చెప్పాలంటే.. ఏషియన్ సినిమాస్‌లో ‘ప్రేమంటే’ అనే సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నా. గీతా ఆర్ట్స్‌లో బన్నీవాస్ నిర్మాణంలో ‘మిత్రమండలి’ అనే మరో ప్రాజెక్టు ఉంది. ఇంకా కొన్ని కథలు వింటున్నా. బలమైన పాత్రలుం డే సినిమాల్ని ఎక్కువగా చేయాలని అనుకుంటున్నా” అని చెప్పారు.