03-03-2025 12:46:50 AM
గత నెల 28న మంచు చరియలు విరిగిపడటంతో ప్రమాదం
డెహ్రాడూన్, మార్చి 2: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై మంచు చరియలు విరిగిపడిన ప్రమాదంలో మరణిం చిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం సహాయక చర్యలు కొనసాగగా ప్రమాదంలో గల్లంతైన కార్మికుడికి సంబంధించిన చివరి మృతదేహాన్ని రెస్యూ సిబ్బంది గుర్తించారు.
కాగా గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం సంభవిస్తోంది. ఈ క్రమంలో చమౌలీ జిల్లాలోని మనా గ్రామం సమీపంలోగల బద్రీనాథ్ జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచును 54 మంది కార్మికులు తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 46 కార్మికులను రెస్క్యూ టీం రక్షించగా.. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.