18-02-2025 01:16:49 AM
కెంటకీలో తెగిన ఒబియాన్ నది ఆనకట్ట
న్యూయార్క్, ఫిబ్రవరి 17: అమెరికాలో అకాల వర్షాలు 10 మంది ప్రాణా లు బలిగొన్నాయి. కెంటకీ రాష్ట్రంలో ఒబియాన్ నది ఆనకట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా సమీప ప్రాంతాలు జలమయ్యాయి. ఆదివారం ఆకస్మికంగా వచ్చి న వరదల నుంచి చాలా మందిని రక్షించినట్లు కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ తెలిపారు. ఈ సంఖ్య వెయ్యికి పైగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.