calender_icon.png 14 January, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివిధ నేరాల్లో 28 మందికి జైలు

05-08-2024 01:38:14 AM

పోలీసులను అభినందించిన డీజీపీ 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మహిళలు, చిన్నారులపై జరుగుతన్న లైంగిక దాడులు, ఇతర నేరాల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తూ బాధితులు, వారి కుటుంబాల్లో భరోసా నింపుతున్నారని డీజీపీ జితేందర్ తెలిపారు.

దీంతో ఈ సంవత్సరం మొత్తం 28 కేసుల్లో నిందితులకు కోర్టు శిక్ష విధించిందని, ఇందులో అత్యాచారం, పోక్సో కేసులో 15 మందికి 20 ఏళ్లు, ఇద్దరికి 25 ఏళ్లు, 11 మందికి జీవిత ఖైదుతో కలిపి మొత్తం 28 మందికి శిక్ష పడిందని ఆదివారం డీజీపీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. పోలీస్ ప్రతిష్టను మరింత పెంచాలని కోరారు. ఈ కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే ఉన్నాయని పేర్కొ న్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై ఏమాత్రం సహించేది లేదని డీజీపీ హెచ్చరించారు.