14-02-2025 12:20:36 AM
కరీంనగర్/నల్లగొండ, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసింది. దీంతో కరీంనగర్ పట్టభద్రుల స్థానం లో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది, నల్లగొండ ఉపాధ్యాయ స్థానంలో 19 మంది బరిలో నిలిచారు.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో 12 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మదనం గంగాధర్ కాంగ్రెస్ అభ్యర్థి వీ నరేందర్‌రెడ్డికి మద్దతు పలుకుతూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
దీంతో బరిలో 56 మంది మిగిలారు. టీచ ర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 16 మందిలో ఒక రు నామినేషన్ ఉపసంహరించుకోగా, 15 మంది పోటీ నిలిచారు. పట్టభద్రుల ఎమ్మె ల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చెన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ తరఫున ప్రస న్న హరికృష్ణ పోటీ పడుతున్నారు.
నల్లగొం డ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానంలో కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండ నాగరాజు తమ నామి నేషన్లు ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ నెల 11న జరిగిన నామినేషన్ల పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి ఉపేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకోవడంతో, బరిలో 19 మంది నిలిచినట్టు రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.