08-02-2025 07:33:55 PM
బైంసా (విజయక్రాంతి): నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీపై ప్రజలకు విశ్వాసం ఏర్పడడం వల్లనే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి పట్టం కట్టారని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఢిల్లీని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగలేదని అందుకే బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకున్నారని తెలిపారు. వికసిత్ భారత లక్షంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధికి పట్టం కట్టిన ఢిల్లీ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.