కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): దేశం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందంటే ప్రధానమంత్రి మోదీతోనే సాధ్యమవుతున్నదని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆశీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలను సందర్భంగా కోకాపేట్ రాజ్‌పుష్ప అట్రియా అపార్టుమెంట్ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట్, కోకాపేట్, మణికొండ, బండ్లగూడ జాగీర్‌లో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కు వగా ఉన్నాయని తెలిపారు.
వేసవి కాలం రాగానే గేటెడ్ కమ్యూనిటీలోని పలు అపార్టుమెంట్లలో నీటి ఎద్దడి ఏర్పడిందని, అపా ర్టుమెంట్ వాసులు బయట ట్యాంకర్లతో నీళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చి ందన్నారు. తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టాక స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రపంచం లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడానికి మోదీ చేసిన కృషి మరువలేనిదన్నా రు. ఈ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశం లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కార్పొరేటర్ ఆదిత్య, పార్టీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ప్రదీప్, గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెం ట్ సురేశ్, మనోహర్‌రావు పాల్గొన్నారు.