ఎమ్మెల్యే బొజ్జు పటేల్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు బుధవారం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పాటు పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.