calender_icon.png 6 January, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి గ్రూప్ మెయిన్స్‌కు 473 మంది

11-07-2024 12:45:32 AM

అభ్యర్థులకు టీఎస్‌ఎస్సీడీడీ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ అభినందనలు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): గ్రూప్ మెయిన్స్‌కు తెలం గాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి 473 మంది ఎంపికపై బుధవారం టీజీఎస్సీడీడీ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రిలిమ్స్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఎంపికైన వారిలో హైదరాబాద్ మెయిన్ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి 126 మంది ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాల్లోనూ 25 మంది విద్యార్థులు ఐఏఎస్ మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకున్న మరింతమంది అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు సకాలంలో నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.