22-01-2025 12:31:22 AM
పటాన్ చెరు, జనవరి 21 : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 16 మందికి జిల్లా కోర్టు జరిమానా విధించినట్లు పటాన్ చెరు ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీధర్ గౌడ్ మంగళవారం తెలిపారు. 11 మందికి రూ.1500 చొప్పున ముగ్గురికి వెయ్యి చొప్పున ఇద్దరికీ రూ.2 వేల చొప్పున కోర్టు జరిమానా విధించిందని చెప్పారు.