calender_icon.png 26 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టల్ బ్యాలెట్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న 94 మంది: కలెక్టర్

26-02-2025 02:02:10 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రంలో మంగళవారం 94 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల వ్యవధిలో 94 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.