calender_icon.png 21 January, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ దీక్షల షోను ప్రజలు నమ్మరు

21-01-2025 02:02:34 AM

* రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేశారు 

* రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ 

* ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాం తి): రైతు భరోసాపై హరీశ్‌రావు అబద్ధాలు చెబుతుంటే.. కేటీఆర్ రైతు దీక్షల పేరుతో మొసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని, రైతన్నలను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రా న్ని నలుగురు వ్యక్తులు దోచుకొని అప్పులపాలు చేశారని ఆరోపించారు.

సోమవారం ఆది శ్రీనివాస్ సీఎల్పీ కార్యాలయంలో ప్రభు త్వ విప్ రామచంద్రనాయక్‌తో కలిసి  మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2018 వరకు చేసిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీకే  సరిపోయిందన్నారు. ఫార్ము లా ఈ రేసు కేసును లొట్టపీసు కేసు అన్న కేటీఆర్.. న్యాయస్థానాల వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, భూమిలేని పేదల కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతుల కోసం రూ.61 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రామచంద్రనాయక్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, హామీలను సమానంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ బియ్యంతో పాటు మూడు, నాలుగు రకాల నిత్యావసర సరుకులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.