calender_icon.png 20 September, 2024 | 2:58 PM

దేవుళ్లెవరనేది ప్రజలే నిర్ణయిస్తారు

07-09-2024 12:19:33 AM

ఎవరికి వారు ప్రకటించుకోవడం వృథా ప్రయత్నమే

మణిపూర్‌లో శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

పుణే, సెప్టెంబర్ 6: ఎవరికి వాళ్లు దేవుళ్లమని స్వయంగా ప్రకటించకోకూడదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఎవ రు దేవుళ్లన్నది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. 1971లో ఆర్‌ఎస్ ఎస్ కీలక నేత శంకర్ దినకర్ ఖానే మణిపూర్‌లో చేసిన సేవలను స్మరిస్తూ పుణెలో జరిగిన కార్యక్రమంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మెరుపులా వెలగాలని కోరుకుంటారని, కానీ పిడుగు పడిన తర్వాత చీకటి ఆవరిస్తుందని, కానీ దాన్ని ఎవరూ గుర్తించరని అన్నారు.

మణిపూర్‌లో శంకర్ చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారని, అక్కడినుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకొచ్చి బస ఏర్పాటు చేసి మరీ  బోధనా సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో మణిపూర్ సంక్షోభంపై మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితి సంక్లిష్టంగా మారినా ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు బలంగా నిలబడ్డారని ప్రశంసించారు. 

పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం

మణిపూర్‌లో ప్రజల భద్రతకు ఎలాంటి హామీ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులే తమ భద్రత విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇక వ్యాపారాలు, సేవ కోసం అక్కడికి వెళ్లేవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంద న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం సంఘ్ అక్కడే ఉండి శాంతిని నెలకొల్పేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. సాధారణ ఎన్జీనోలు చేయలేని పనిని కూడా సంఘ్ చేస్తోం దని భగవత్ కొనియాడారు. మణిపూర్ వివాదంలో అన్ని వర్గాలతో చర్చిస్తున్నామ ని, పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మణిపూర్‌లో కొన్ని నెలలు గా జరుగుతున్న అల్లర్లలో 200 మంది చనిపోగా 60 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.