calender_icon.png 12 February, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

41 మంది సజీవ దహనం

10-02-2025 12:25:38 AM

దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. కాన్సున్ నుంచి టబాస్కోకు సుమారు 48 మందితో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో 38 మంది ప్రయా ణికులు సహా బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, టక్రుకు సంబంధించిన ఓ డ్రైవర్ మరణించినట్టు వివరించారు. ప్రమాద ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైందని అధికారులు చెప్పారు.