15-04-2025 08:49:56 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల మండల కేంద్రంలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ తొమ్మిది మందిని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. పేకాట, గంజాయి కేసుల్లో వీరు నిందితులని చెప్పారు. పేకాడిన, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రసాద్ హెచ్చరించారు.