calender_icon.png 11 February, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీచక టీచర్‌కి దేహశుద్ధి.. మహిళతో అక్రమ సంబంధం

11-02-2025 01:40:01 PM

పెళ్లైంది ఇద్దరు పిల్లలు,వేరే మహిళతో అక్రమ సంబంధం

సహనం కోల్పోయిన భార్య గ్రామస్థులతో కలిసి ఇరువురికి దేహశుద్ధి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): లక్షణంగా పెళ్లయింది, వారికి ఇద్దరు పిల్లలు, చేసేది పవిత్రమైన ఉపాధ్యాయ(Teacher) ఉద్యోగం. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం(Premarital Sex) ఏర్పరచుకున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించిన పద్ధతి మారకపోవడంతో కట్టుకున్న భార్య గ్రామస్తులతో కలిసి ఇరువురికి దయాశుద్ధి చేసిన వైనం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి తండాలో అజ్మీరా హరిదాసు మునియా తండాలో  ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి పదిహేను సంవత్సరాల క్రితం పాల్వంచ మండలం పండురంగాపురం గ్రామానికి చెందిన విజయ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

రోజు మాదిరిగానే యాద విధిగా స్కూల్ టైంకి వెళ్లి స్కూల్ ఐపోగానే వచ్చే హరిదాసు, కొంతకాలంగా రాత్రి వేళల్లో ఇంటికి రావడం మానేశాడు. అనుమానం వచ్చిన విజయ భర్తను నిలదీసింది. అతను చెప్పే సమాధానం పొంతన లేకపోవడంతో అనుమానం మరింత బలపడింది. దంతో భార్య విజయ ఒకసారి భర్తను అనుసరించి ఎక్కడికి వెళుతున్నాడని వెంబడించగా చుంచుపల్లి తండాలో మరో మహిళతో దొరికాడు. ఇరువురిని నిలదియగా తను ఆ మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు.  నితో, నీ పిల్లలతో నాకు ఏటువంటి సంబంధం లేదు..  ఈమెతోనే ఉంటాను అని భార్యను కొట్టి పంపించేశాడు. పాల్వంచ పోలీస్ స్టేషన్ లో విజయ ఫిర్యాదు చేయగా ఎస్ఐ అజ్మీరా హరిదాసును పిలిపించి మాట్లాడాడు. ఎప్పుడో ఈ మహిళను పెళ్లి చేసుకున్న అని, నా భార్యకి నాకు ఏటువంటి సంబంధం లేదని చెప్పడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అయిన ఈ కీచక టీచర్ బుద్ధి మారలేదు. ఇంటికి వచ్చి భార్యని పలు మార్లు విచక్షణ రహితంగా కొట్టే వాడు. భార్య తల్లితండ్రులు, బందువులు ఎంత చెప్పినా పెడ చెవిన పెట్టి ఆ మహిళ దగ్గరికి వెళ్తుండే వాడు. భార్య విజయకు తన జీతం నుండి ఒక రూపాయి కూడా ఇచ్చే వాడు కాదని, ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నా వారికి కాలేజీ ఫీజులు కట్టక, ఇంటిలో సరుకులు తీసుకురాక పోవడంతో విజయ ఎన్నో రోజులు పస్తులు పడుకునేది. సహనం కోల్పోయిన విజయ కడుపు మండి బంధువులతో కలిసి వెళ్లి భర్తకి, మహిళకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో మళ్ళీ పిర్యాదు చేసింది.