calender_icon.png 15 March, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మయన్మార్ స్కాం’ ఘటనలో 8మంది అరెస్ట్

15-03-2025 12:00:00 AM

నిందితులపై 9 కేసు నమోదు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14(విజయక్రాంతి)  : మయన్మార్ స్కామ్ కాంపౌండ్స్  ఘటనలో బాధితుల ఫిర్యాదు మేర కు 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు  తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో (టీజీసీఎస్బీ) డీజీ శిఖా గోయల్ శుక్రవారం తెలిపా రు.  ఈ స్కామ్ లో  తెలంగాణకు చెందిన  24 మంది బాధితులను రక్షించినట్లు పేర్కొన్నారు.

వారి లో 10 మంది బాధితుల ఫిర్యాదుతో పలు సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమో దు చేసినట్లు వెల్లడించారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న 15 మంది ఏజెం ట్లు, మధ్యవర్తులను గుర్తించామన్నారు. నిందితుల్లో 8 మందిని అరెస్టు చేశామని, మరో ఐదుగురు విదేశాల్లో ఉన్నారని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో అల్లెపు వెంకటేష్(జగిత్యాల),  చల్ల. మహేష్ అలియాస్ మల్లికార్జున్ (జగిత్యాల),  మొహమ్మ ద్ జలాల్ (హైదరాబాద్),  బొమ్మ వసంత్ కుమార్ (హైదరాబాద్), దాసరి ఏక్నా థ్ గౌడ్(హైదరాబాద్), కాటంగూరి సాయి కిరణ్ (వేములవాడ), హెచ్ బషీర్ అహ్మద్ (హైదరాబాద్),  గాజుల అభిషేక్‌లు ఉన్నారు.