calender_icon.png 28 February, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్లబండ్ల పందెంలో పాల్గొన్న 12 మంది అరెస్ట్

27-02-2025 07:52:55 PM

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలకు చెందిన 12 మంది ఎడ్లబండ్ల పందెంలో పాల్గొన్నందుకు అరెస్టు చేసినట్లు ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. 26వ తేదీన ఉదయం 6 గంటలకు ఎల్కతుర్తి నుండి ముల్కనూర్ ఎడ్ల బండ్ల పందెం పోటీలు నిర్వహిస్తుండగా ఒక ఎడ్ల బండి అతివేగంగా వచ్చి అయిత సంపత్ ఆటోకు తగలడంతో ఆటో అద్దాలు పగిలి నష్టం జరిగింది. దీనిపై విచారణ చేపట్టగా భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలకు చెందిన బెల్లి శ్రీధర్, మేడిపల్లి ఎల్ల స్వామి, ముసికే మహేష్ బాబు, బిక్షపతి, సంఘం సతీష్, ఎలబోయిన రాజు, పోతిరెడ్డి అరుణ్, గొర్రె ఎర్రయ్య, గ్యారంపల్లి పవన్, నా రెడ్డి వంశీ, చేపూరి కుమార్ ఎడ్లబండ్ల పందాలు నిర్వహించి నందుకు వారిని అరెస్టు చేసి వారి నుండి రూ.24 వేలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.