22-03-2025 11:37:12 PM
రూ.10 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టివేత..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఢిల్లీ నుంచి విదేశీ మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బీటీం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువైన విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బషీర్‌భాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలోని టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 24 రకాల, 233 విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దోమలగూడకు చెందిన హరికుమార్ ఈర్వాణి, సికింద్రాబాద్‌కు చెందిన విలియమ్స్ జోసెఫ్‌లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన దీపక్, ధర్మబట్టి, సునీల్ అనే మద్యం వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. మద్యాన్ని పట్టుకున్న బృందంలో ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై ఎన్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.