calender_icon.png 16 March, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు

15-03-2025 12:04:33 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి  

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): దళిత సామాజికవర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అసెంబ్లీలో అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డికి మద్దతుగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షచేస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఆడుతున్న డ్రామాల న్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, పిచ్చి ఆలోచనలను మాను కోవాలని హితవు పలికారు. కేటీఆర్‌కు దళితుల మీద ఎలాంటి ప్రేమ, అభిమానం లేదన్నారు. తెలంగాణ ప్రజల ను రెచ్చగొట్టి అసెంబ్లీని స్థంభింపజేయాలని చూస్తున్నారని మండిప డ్డారు. ప్రణబ్‌ముఖర్జీ వస్తే కాళ్లకు దండం పెట్టిన కేసీఆర్..అదే రామ్‌నాథ్ కోవింద్ వస్తే కనీసం పట్టించుకున్న దాఖాలాలు లేవన్నారు.