మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ అధినేతను కేసీఆర్‌ను ప్రతిరోజూ గుర్తు చేసుకుంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ప్రజలు కోరుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డితోపాటు మాజీమంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జోగు రామన్న, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, బీఆర్‌ఎస్ నాయకుడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్కటీ అమలుకాలేదని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై రాష్ర్టవ్యాప్త పర్యటన చేశామన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు పర్మిషన్ లేదంటున్నారని వాపోయారు.