calender_icon.png 1 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 మంది జలదిగ్బంధం

19-07-2024 12:23:18 AM

పొలం పనులకు వెళ్లి పెదవాగులో చిక్కుకున్న కూలీలు

ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చుట్టుముట్టిన నీరు

సాయం కోసం సాయంత్రం దాకా ఎదురుచూపు

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి పర్యవేక్షణ

హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా తరలింపు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై ౧౮(విజయక్రాంతి)/ అశ్వారావుపేట: పని కోసం వెళ్లిన కూలీలు, పశువులతో వెళ్లిన కాపర్లు పెదవాగులో చిక్కుకుపోయారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పరిధిలోని పెదవాగు ప్రాజె క్టు గురువారం నిండుకుండలా మారడంతో  అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఒక్కసారిగా వరద  రావడంతో వాగు ఉద్ధృతంగా మారి దిగువన ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో దాదాపు 25 మంది నీటిలోనే చిక్కుకున్నారు.

సాయంత్రం దాకా వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం తెలుసుకొన్న రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.  ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరలో ఉండటంతో ఏపీ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో మాట్లాడారు. పొంగులేటి విజ్ఞప్తి మేరకు ఎన్డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎప్ బృందాలు రంగంలోకి దిగాయి. వాగులో చిక్కుకున్న ౨౫ మందిని రెండు హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా బయటికి తరలించారు. నారాయణ పురంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జితేష్‌వీ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి రక్షణ చర్యలు చేపట్టారు.  

ఎడతెరపి లేని వాన..

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టుకు, వరద పోటెత్తుతుంది. కిన్నెరసాని జలాయశం నీటి మట్టం 402.60 అడుగులకు చేరుకొంది. 5 గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తాలిపేరు 13 గేట్లు ఎత్తి 16,877 క్యూసెకులనీరు బయటకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 18.02 అడుగులకు చేరుకొంది. శుక్రవారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షం కురిసింది. 

అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. భద్రాద్రి జిల్లా పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్నారు. దీనిపై  సీఎస్ భద్రాద్రి కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ పునరా వాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. డీజీ పీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ , నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ కూడా పాల్గొన్నారు.

సీఎస్ మాట్లాడుతూ.. పెద్దవాగు వరద వల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని తెలిపారు. పెద్దవాగు నుంచి నీటి విడుదలతో సమీపంలోని ౪ గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో పొలాల్లో చిక్కుకున్న 2౫ మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ బృందాలు రెండు హెలికాప్ట ర్ల సహాయంతో రక్షించారని సీఎస్‌కు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి ప్రజలను పునరావాస శిబిరా ల్లోకి తరలిస్తున్నామని పేర్కొన్నారు.  

పెదవాగు ప్రాజెక్టు కట్ట పైనుంచి పొర్లిన వరద జలాలు

పెదవాగుప్రాజెక్టు ప్రమాదపుటంచుకుచేరింది. గురువారం తెల్లవారుజాము నుంచి భారీగా వరదనీరు చేరుకోవడంతో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు మూ డో గేటు మోటరు కాలిపోవడంతో తెరుచుకోలేదు. దీంతో నీరు కట్ట పైనుంచి పొర్లుతుంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుమ్మడవల్లి వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లా రు. ప్రాజెక్టు కింద ఉన్న కొత్తూరు, ఏపీలోని వేలేరుపాడు మండలంకుమ్మరిగూడెంతో కలిపి 18 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. 

పిడుగుపాటుకు అన్నాతమ్ముడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల జమేదారుబంజర్‌లో గురువారం పిడుగుపడి అన్నాతమ్ముడు మృతిచెందారు. గ్రామానికి చెందిన బొర్రా సిద్ద్దు (15), బొర్రా చందు (11) తల్లిదండ్రులు మల్లేశ్, నాగమణితో కలిసి పుల్లయ్య చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లారు. తల్లిదండ్రులు చేపలు పడుతుండగా కొంత దూరంలో చందు, సిద్దు గట్టుమీద కూర్చుని చూస్తున్నారు. ఈ క్రమంలో ఒకేసారి ఉరుములు, మెరుపులతో పిల్లలు ఉన్నచోట పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. చందు స్థానిక ప్రాథమి క పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సిద్దు దమ్మపేట మండలం చీపురుగూడెంలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు పిల్లలు మృతి చెంద డంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.