calender_icon.png 12 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తిలో రెచ్చిపోయిన దొంగలు

22-03-2025 01:56:26 AM

వరుసగా రెండు ఇళ్లల్లో చోరీ 

2లక్షల నగదు, 5తులాల బంగారం, 40 తులల వెండి మాయం

వరుస దొంగతనలతో భయపడుతున్న జనం 

కల్వకుర్తి మార్చి 21: పట్టణంలోని తిలక్ నగర్, కళ్యాణ్ నగర్ కాలనిలోని తాళాలు వేసిన రెండు ఇళ్లల్లో వేరువేరుగా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిలక్ నగర్ కాలనిలో నివాసముంటున్న శ్రీను పవర్ గురువారం బంధువుల పెళ్లికి వెళ్లి మరుసటి రోజు శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి, బీరువా తాళాలు పగలగొట్టబడి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలు, (1)లక్ష నగదు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. కాగా కళ్యాణ్ నగర్ లో నివాసం ఉంటున్న వెంకట్ గౌడ్ కుటుంబంతో పాటు బందువుల శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి దోపిడి దొంగలు తమ ఇల్లును లూఠీ చేశారు.

అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి 1.20 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం దోచుకెళ్లారు. దీంతోపాటు ఇందిరా నగర్ కాలనిలో నిద్రిస్తున్న మహిళ మెడలోంచి పుస్తెలతాడు, సెల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించిన మహిళను పట్టుకొని కాలనీ వాసులు మందలించి పోలీసులకు అప్పచెప్పారు. వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు నిఘా పెంచడంలో విఫలమయ్యారని పట్టణ వాసులు బహిరంగానే చర్చించుకుంటున్నారు.ఇటు పోలీసులు కూడా క్రైమ్ కి సంభందించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిందితులను రిమాండ్ కి తరలించడంలొ ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.