calender_icon.png 25 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో ప్రజలు జరభద్రం..

25-04-2025 08:29:47 PM

కాంగ్రెస్ యువ నాయకులు పృథ్వి కుమార్ రెడ్డి...

వేములపల్లి (విజయక్రాంతి): ప్రస్తుత వేసవికాలంలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు మేరెడ్డి పృథ్వి కుమార్ రెడ్డి సూచించారు. ఆయన ఒక ప్రకటనలో సోమవారం మాట్లాడుతూ... వేసవి తాపాన్ని అధిరోహించేందుకు గంటకు ఒకసారి మట్టి కుండలోని నీళ్లను తీసుకోవడంతో పాటు చల్లని ప్రదేశాలలో సేద తీరాలని కోరారు. వేసవి తాపాన్ని జయించేందుకు వృద్ధులు తమ తమ ఇండ్లలో నుంచి బయటికి రాకుండా సాయంత్రం వరకు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ఎవరికైనా మార్కెట్లలో పనులు ఉన్న ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం 5 గంటల తర్వాత పనులను పూర్తి చేసుకోవాలని కోరారు.