calender_icon.png 12 January, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లొట్టపీసు మాటలను ప్రజలు గమనిస్తున్నారు

12-01-2025 01:37:48 AM

* కేటీఆర్ సంస్కారానికి నా నమస్కారం

* చట్టం తన పని తాను చేసుకుపోతుంది

* నేను చెప్పిన బాంబులు ఎప్పుడో పేలాయి 

* రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం, జనవరి 11 (విజయక్రాంతి): ఇటీవల ఓ నాయకుడు తరచూ మాట్లాడుతున్న లొట్టపీసు మాటలను ప్రజ లు గమనిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఆయన సంస్కారానికి నా నమ స్కారం’ అని అన్నారు.

శనివారం ఖమ్మంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ అరెస్ట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా మంత్రి పైవిధంగా స్పందించారు. విదేశాల్లో చదివానని చెప్పే అతను అలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలని అన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వం తొందరపడి ఎవరినీ రాజకీయ కోణంలో అరెస్ట్ చేయబోదని స్పష్టంచేశారు. కేటీఆర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నాటి మంత్రులు చెప్పినట్టే జరుగుతుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

తప్పుడు కేసులు బనాయించి, ఎవరినీ ఇబ్బందిపెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కవ్వడంతోనే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజ య్ చేసిన వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించారు.

కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే, ఈడీ కూడా ఎంటరై కేసు రిజిస్టర్ చేసింది కదా? ఈ వ్యవహారంలో  మేం కుమ్మక్కయ్యామని భావిస్తే.. ఈడీ వారి చేతుల్లోనే ఉంది కదా.. మరి వారెందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

ఒక రోజు వెనుకా ముందు విచారణ తర్వాతనే కచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నా రు. తానన్న బాంబులు ఎప్పుడో పేలాయని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మంత్రి చమత్కరించారు.