calender_icon.png 24 October, 2024 | 7:04 PM

మా కెమిస్ట్రీని ఇష్టపడుతున్నరు

20-07-2024 02:30:34 AM

‘డార్లింగ్’ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ నభా నటేష్ 

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం ప్రపం చవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. ప్రీమియర్స్‌కు మంచి స్పందన రావటంతో చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “సినిమాలోని కామెడీ, ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవు తున్నారు.

సినిమా చూస్తూ మా అమ్మ గారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది. మనం చేసిన పనికి ఇంట్లో వాళ్ల నుంచి ప్రశంస వస్తే ఆ సంతోషం వేరుంటుంది. మహిళా ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘డార్లింగ్’ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా’ అన్నారు. హీరోయిన్ నభా మాట్లాడుతూ.. “డార్లింగ్’ క్లీన్ ఫ్యామి లీ ఎంటర్‌టైనర్. అమ్మాయిలు సినిమాతో పాటు దర్శికి, నాకు మధ్య పండిన కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు’ అని చెప్పింది.