calender_icon.png 11 March, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనలో ఇబ్బందుల్లో ప్రజలు

10-03-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ 

భద్రాచలం, మార్చి 9 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యులు, ఖమ్మం జిల్లా బిఆ ర్‌ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ అన్నా రు. భద్రాచలం పర్యటనకు వచ్చిన సంద ర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఇంటి వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ మాట్లా డుతూ కాంట్రాక్టర్ల కమిషన్లు, ఇసుక దందా లే కాం గ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రం లో ఏ గ్రామంలో కూడా 30 శాతం కూడా రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ వస్తే కష్టా లు కొని తెచ్చుకున్నట్టు ప్రజలకు అర్థమవు తుందని తెలిపారు.

కెసిఆర్ పదేళ్ల పాలల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు హైద రాబాద్ నగరంలో ఏటువంటి నీటి ఎద్దడి లేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హైద రాబాద్ నగరంలో ఎటు చూసినా వాటర్ ట్యాంకులే దర్శనమిస్తున్నట్లు తెలిపారు. రెండు వేల పెన్షన్ రూ 4వేలు చేస్తా మని చెప్పిన ప్రభుత్వం తీవ్రంగా కాలయా పన చేస్తున్నదని, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా రాష్ట్ర సచివాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టి సంఘటన ప్రస్తుత ప్రభు త్వ హయాంలోనే జరిగిందని విమర్శిం చారు.  టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి తెలంగా ణ సాధించిందని, 25 ఏండ్ల చరిత్ర కలిగిన టిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఏప్రిల్ 27న లక్షలాది మంది మధ్య వరంగల్ లో జరుగుతుందని కూడా మధుసూదన్ తెలి పారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాం ప్రసాద్, మనే రామకృష్ణ మండల పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచందర్రావు, ప్రేమ్ కుమార్ తుమ్మల పల్లి ధనేశ్వర రావు పాల్గొన్నారు.