09-04-2025 01:07:01 AM
కల్లూరు, ఏప్రిల్ 8 :-కల్లూరు మండలంలో తాటి ముంజలకు భాలే గిరాకీ ఏర్పడింది.ఎండాకాలం కావడం, రోజు రోజుకు ఎండ తీవ్రత అధికం అవుతుండడంతో తాటి ముంజులకు మరింత డి మాండ్ పెరిగింది. ముంజల్లోని నీరు, లోపలి గుజ్జు ఎంతో రుచిగా ఉంటాయి. ఎండ వేడిమి లో వీటిని తీసుకుంటే శరీరానికి చల్లదనమే కాకుండా మానసిక ఆనం దం కూడా లభిస్తుంది.
మండే ఎండల్లో ఆరోగ్యాన్ని కాపాడటంలో తాటి ముంజులు ఉత్తమమైనవి. ప్రకృతి ప్రసాదించిన ముంజ ల్లో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ, బి, సి, ఐరన్, ఉండ టంతో శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇవన్నీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు వెలుపలికి వచ్చేలా చేస్తాయి. తరిమేస్తాయి.
నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది.. ఎండ వేడి తగిలినా వడదెబ్బ తగలకుండా మనిషిని కాపాడుతుంది. ముంజల్లో ఉండే పోటాషియం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.చెడు కొలస్ట్రాల్ పో యి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందడం ద్వారా గుండె ఆరోగ్యవంతంగా ఉండేలా చే స్తుంది. శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది.
ముంజుల వల్ల లివర్ సమస్యలు కూడా తొలగుతాయి. ముంజలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ రాకుండా చేస్తుం ది. వికారం, వాంతులను నివారిస్తుంది. వేసవిలో ఎక్కువగా వచ్చే పొంగు నుంచి శరీరా న్ని చల్లగా ఉంచుతూ ఉపశమనాన్ని ఇస్తుం ది. ఇంకెందుకు ఆలస్యం.. ముంజలను ఓ పట్టు పట్టండి.