26-04-2025 01:15:28 AM
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివ ర్సిటీ శుక్రవారం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు 2,808 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 3,448 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 81.43 శాతం మంది హాజరైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 27 వరకు మొత్తం 49 సబ్జెక్టులకు సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.