calender_icon.png 30 April, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజు ఎప్‌సెట్‌కు 3,959 మంది గైర్హాజరు

30-04-2025 12:00:07 AM

హాజరైన అభ్యర్థులు 93.53 శాతం

హైదరాబాద్ (విజయక్రాంతి): అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్ష(TG Epcet Exam)కు తొలిరోజు 3,959 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో జరిగిన పరీక్షకు మొత్తం 16 జోన్లు కలిపి 93.53 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం సెషన్‌కు 26,741 (92.74శాతం) మంది పరీక్షకు హాజరవ్వగా.. 2093 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 26,964 (93.53 శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1866 మంది గైర్హాజరయ్యారు. తొలి రోజు ఎప్‌సెట్ ప్రశ్నపత్రం మధ్యస్థంగా వచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం సెషన్‌లో అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.